బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు నవతా రెడ్డి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి విజయ సంకల్ప సభ విజయవంతమైన శుభసందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భాగ్యనగరంలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలను దిగ్విజయంగా నిర్వహించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షలు సామ రంగా రెడ్డి తో కలిసి బొబ్బ నవతా రెడ్డి అభినందనలు‌ తెలిపారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న బొబ్బ నవతా రెడ్డి

అనంతరం ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో మోదీ సమక్షంలో బిజెపిలోకి చేరిన తెలంగాణ ఉద్యకారులు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని బిజెపి నాయకులు, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల సమన్వయ కమిటీ మెంబర్ గా నియామకవడం పట్ల ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బ విజయ్ రెడ్డి, పోచయ్య, గౌస్, అనంత రెడ్డి తదితరులు ఉన్నారు.

బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here