శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఒడిసి, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. బెంగళూరు నుండి విచ్చేసిన ప్రముఖ ఒడిసి గురువు డాక్టర్ మనసి పాండ్య రఘునందన్ తన శిష్యరాలు సంహితతో కలిసి ఒడిసి నృత్య ప్రదర్శనలో పంచదేవి కృతి, పల్లవి, బాటు, దుర్గ,మోక్షం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. వైదేహి సుభాష్ శిష్యబృందం భరతనాట్య ప్రదర్శనలో సకలగణాధిప, పుష్పాంజలి, నటేశకుతం, పిబరే రామ రసం, కీర్తన, తిల్లాన అంశాలను మనస్విని, మోక్షిత, మీనాక్షి, పావిక, నిహారిక, ఆవిజ్ఞ , హరిణి కార్తీక మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.