శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్ కాలనీలోని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన సతీమణి ఉప్పలపాటి సుమలతతో కలసి మహిళలను శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సుప్రజ, ఉమా, రాణి, చంద్రకళ, జ్యోతి, కల్పన, సుభద్ర, కృష్ణ, గాయత్రి, రాజేశ్వరి, లక్ష్మి ,లావణ్య, విజయలక్ష్మి, సబిత, శ్యామల తదితరులు పాల్గొన్నారు.