ఘనంగా మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ జన్మదిన వేడుకల‌ను కొండాపూర్‌లోని మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు డివిజన్ల నుండి అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున వచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ పారిశుద్ధ్య కార్మికులకు, పేదల‌కు చీరల పంపిణీ చేశారు. అనంత‌రం వారికి అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. త‌న‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here