స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేలో స‌రైన స‌మాచారం ఇవ్వాలి: డీసీ మోహ‌న్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా చందానగర్ లోని Dr. బి.ఆర్.అంబేద్కర్ కల్యాణ మండపంలో సూపర్వైజ‌ర్లు, ఎన్యుమరేటర్లతో డిప్యూటీ కమీషనర్ పి.మోహన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ (చీఫ్ ఎగ్జామినర్ అఫ్ అకౌంట్స్ ప్రధాన కార్యాలయం) వెంకట్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చందానగర్ డిప్యూటీ కమీషనర్ పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఇంటింటి సర్వే ఫామ్‌లను ప్రతి రోజు సూప‌ర్వైజర్ లు తమ వార్డ్ కి కేటాయించబడిన వార్డ్ నోడల్ అధికారులకి, ఇంచార్జి ఆఫీసర్ లకు అందజేయాలని, ఆ సర్వే ఫామ్‌లను వార్డ్, ఎన్యూమరేటర్ బ్లాక్ నంబర్ల ప్రకారం ట్రంక్ బాక్స్ లలో భద్రంగా భద్రపరచాలని అదేశించారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ఉప క‌మిష‌న‌ర్ మోహ‌న్ రెడ్డి

ఈ సర్వే ఉద్దేశ్యం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతితోపాటు సమాజంలోని వివిధ సామాజిక, ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగు పరచడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడం, వాటిని అమలు చేయడం కోసం అని తెలిపారు. ఈ సర్వే పేద మధ్య తరగతి వారికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కుటుంబ వివరాలు చెబితే ఏదో జరుగుతుందనే అపోహ వద్దని వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీలు, వెల్ఫేర్ అసోసియేషన్ లు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాలలో ఉండే వారు తమ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు సహకరించాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ నివసించేవారు, కిరాయి ఇండ్లలో ఉండే వారు కూడా ఈ సర్వేలో వారి వివరాలు నమోదు చేసుకోవాల‌ని తెలిపారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం సెలవు రోజులలో కూడా ఎన్యూమరేటర్ లు సర్వే కు వస్తారని, ఫామ్‌ల‌లో అడిగిన అంశాల ఆధారంగా అన్ని అంశాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, సమాచారంలో తప్పులు లేకుండా సర్వే కు సహకరించాలని కోరారు.

క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సర్వేలో ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత, విద్యావివరాలు, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, వలస వెళ్లినవారి వివరాల‌ సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ప్రాజెక్ట్ అధికారిణి ఉషా రాణి, ఈఈ కెవిఎస్ఎన్టీ రాజు, ఏఎంసి విజయ్ కుమార్, కృష్ణ, సూపెర్‌వైజర్ లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here