శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ కట్ట వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం దోమ మండలంలో దొంగ ఎనికె పల్లి గ్రామంలో TDP సభ్యత్వ కార్యక్రమాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక్కని నరసింహులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం దిశగా పయనిస్తుందని, కావున మీరు గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలలో తమ పార్టీ తరపున అభ్యర్థులు ఉంటారని తెలియజేశారు.
నాడు నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి కొనియాడారు. గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెబుతూ పోతే చాలు మన పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. నియోజకవర్గ స్థాయి నాయకులకు సభ్యత్వ నమోదు గురించి పార్టీ అభివృద్ధి గురించి దశ దిశ నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు గూడెపు రాఘవులు, కత్తి తమ్ముదన్ రావు, చంద్రశేఖర్, నియోజకవర్గ స్థాయి నాయకులుకృష్ణస్వామి, నర్సింగ్ నాయక్, శ్రీనివాస్, హమ్యా నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, వీరాచారి, చంద్రయ్య, గోపాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.