శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని కొండాపూర్ సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏర్పాటు చేసిన ద్రోణాచార్య ఛాంపియన్స్ లీగ్ -2k24 చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని స్కూల్ ఛైర్మన్ & ఫౌండర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జవహర్ లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేష వేషధారణలో చిన్నారులు ఆటపాటలతో ఉత్సాహపరిచారు. ఈ సందర్బంగా ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ షీల్డ్ లను బహుకరించారు.
అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని అందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే ను జరుపుకుంటామని అన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నెహ్రూ నమ్మారని, బాలల దినోత్సవం అనేది పిల్లల అమాయకత్వం, ఉత్సకత, శక్తి, ఉత్సాహన్ని జరుపుకునే రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో EX ఛైర్మన్ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వి ప్రకాష్, బాస్కెట్ బాల్ కోచ్ పవన్, స్కూల్ డైరెక్టర్ భవాని, ప్రిన్సిపల్స్ జ్యోతిర్మయి, సుబ్బలక్ష్మి, జయంతి, స్కూల్ స్టాఫ్, విద్యార్థి విద్యార్థినుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.