క‌రోనాను ఆరోగ్య‌శ్రీలో చేర్చాలి, ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌ను ప్ర‌భుత్వం స్వాదీనం చేసుకోవాలి: తుడుం అనిల్‌కుమార్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా నియంత్రణ‌ చ‌ర్య‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు తుడుం అనిల్‌కుమార్ మండిప‌డ్డారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐడీఏ బొల్లారంలోని శ్రీ వెంకటేశ్వర కాయర్ ప్రొడక్ట్స్ వ‌ద్ద కార్మికులు నిరసన వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కోవిడ్‌తో మృతిచెందిన‌ కుటుంబాలకు రూ.50 లక్షల ప‌రిహారం చెల్లించాలని, ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉచిత వైద్యం అందించాలని, లాక్ డౌన్ సమయంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇచ్చి ఉచిత నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మనోజ్ కుమార్, లాల్, సబ్జా కాంత్ రాజు, సరోజ్ కుమార్, రామచంద్రా రెడ్డి, శ్రీకాంత్, దీనేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర కాయ‌ర్ ప్రోడక్ట్స్ ముందు నిర‌స‌న తెలుపుతున్న తోటి కార్మికుల‌తో తుడుం అనిల్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here