నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ంఎసీ ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ బుదవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డి, నార్నేశ్రీనివాస్ రావులతో కలసి పెండింగ్ పనులు, ప్రధాన సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులతో గాంధీ చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చందానగర్, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని డివిజన్లలలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారాలు చేపట్టాలని, అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులలో జాప్యం జరుగకుండా, ప్రజల ఇబ్బందులను త్వరిత గతిన తీర్చే విదంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, రోడ్లు, నాలా నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, టెండర్లు పూర్తయిన పనులను వెంటనే చెప్పట్టాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని , యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇకపై పనులలో జాప్యాన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పనులు తీసుకొని జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని, మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని ,శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిహెచ్ఎంసి అధికారులు, ఎస్ఈ చిన్నా రెడ్డి, ఈఈలు సుదర్శన్, శ్రీకాంతిని, డీఈలు శ్రీనివాస్, రమేష్, సురేష్, రూపదేవి, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.