శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ లో పలు కాలనీలు, బస్తీలలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. వేమన కాలనీ 33/11 కేవీ ఫీడర్ పరిధిలో ఉన్న రాజేందర్ రెడ్డి కాలనీ, అమీన్‌పూర్ మెయిన్ రోడ్డు, పద్మజ కాలనీ, విద్యానగర్, సురక్ష ఎన్‌క్లేవ్, సత్య ఎన్‌క్లేవ్, శుభోదయ కాలనీ, అపర్ఱ హెచ్‌టీ సర్వీస్, భవానిపురం రెడ్డీ కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, శంకర్ నగర్, భిక్షపతి ఎన్‌క్లేవ్, జవహర్ కాలనీ రోడ్ నం.4,5,6, కైలాష్ నగర్, శ్రీదేవి థియేటర్ దగ్గర మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.