శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని మతాల వారు కలసి కట్టుగా ఉంటారని, సమైక్యత కోసం పోరాటం చేస్తారని అన్నారు. భారత దేశం అన్ని మతాలకు చెందిన ప్రజలకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. ప్రజలందరూ మత సామరస్యం పాటిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే సాయన్న ముదిరాజ్, అంజన సత్యనారాయణ యాదవ్, సుబ్రహ్మణ్యం, ముస్లింలు పాల్గొన్నారు.