శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని అన్నమాచార్య భావన వాహినిలో వారాంతపు అన్నమ స్వరార్చనలో భాగంగా శృతిలయ మ్యూజిక్ అకాడమీ గురువు చింతద శివరంజని రామ్, శిష్యులు కాశ్యప్, దివిజ, జయశ్రీ, గాయత్రి, ధృవిన్, హర్షిని, హారిక, తరంగిణి, చైతన్య, సాయి ప్రణవి, అన్వితలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అలరించారు. ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో ప్రారంభించి, అనంతరం పలకండి పలకండి రామ నామము, మూషిక వాహన, విష్ణు సహస్రనామ స్తోత్రము, కామాక్షి కళ్యాణి, హారతి గీయున్న, ప్రణవ స్వరూపం, గోవింద గోవింద యని పలుకరే, కట్టెదురా వైకుంఠం, శ్రీమన్నారాయణ, చాలదా హరినామ, నారాయణతే నమో నమో, భగవద్గీత శ్లోకం, అంతర్నుండు అవరో తలచిన, జై శ్రీమన్నారాయణ, తేనేటి మధురమయ్యా, చక్కని తల్లికి ఛాంగుభళా, అలరులు, సిరుత నువ్వుల వాడు, గోవిందాశ్రిత, విన్నపాలు వినవలె, క్షిరాబ్ది కన్యకకు అనే మధుర సంకీర్తనలతో అలరించాచరు. వీరికి సుదర్శన్ కీబోర్డు పై, శ్రీధర్ తబలా పై వాయిద్య సహకారం అందించారు. కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, శోభా రాజు జ్ఞాపికలతో సత్కరించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.