విద్యార్థుల భ‌విష్య‌త్తుకు విద్యాసంస్థ‌లు బాట‌లు వేయాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ విల్లే ఎ ప్రీమియం ప్రీస్కూల్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలోని లిటిల్ విల్లే ఎ ప్రీమియం ప్రీస్కూల్ ను విద్యాసంస్థను ప్రారంభించడం చాలా శుభవపరిణామని, విద్యను అందించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు జ్ఞానం అందించడమేనని ఆయన అన్నారు. ఈ విద్యా సంస్థ ద్వారా పిల్లలు చక్కని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ తమ్మి వెంకటేశ్వర్లు, తమ్మి లలిత, స్కూల్ డైరెక్టర్, ఆంజనేయులు, మహేష్, కెఎస్ ఎన్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here