శేరిలింగంపల్లి, జూన్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైజయంతి సిల్క్స్ షో రూమ్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వైజయంతి సిల్క్స్ షో రూము ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , కస్టమర్లు దేవుళ్ల తో సమానము కావున నాణ్యత పాటిస్తూ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తూ వారి మనసును చూరగొనాలని, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు నడుచుకోవాలని, వారి మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.