శేరిలింగంపల్లి, జూన్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్‌పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.11,01,276 ఆర్థిక సహాయాన్ని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల రూపేణా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చంద్రమోహన్ సాగర్, చిరుమూర్తి రాజు, విమల, స్వప్న, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు.