శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మలుక కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొమరయ్యను కలిసిన చంద్రమోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఇకపై ఏ ఎన్నిక వచ్చినా బీజేపీదే విజయమని, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.