శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ భూమిని ఆక్రమించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. దానిపై ఆయన స్పందించారు. చందానగర్‌లోని సర్వే నంబర్ 27లో ఉన్నది ప్రభుత్వ భూమి అని, అది శ్మశానమని, దాన్ని అప్పటి చందానగర్ సీఐ క్యాస్ట్రో కబ్జా చేశారని భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై డిప్యూటీ కలెక్టర్ స్పందించారని తెలిపారు. వెంటనే దీనిపై రిపోర్టును అందజేయాని గిర్దావర్‌ను డిప్యూటీ కలెక్టర్ ఆదేశించారని భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాలని భాస్కర్ రెడ్డి అన్నారు.