శేరిలింగంపల్లి, జూన్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, కాలనీ వాసులు, అధికారులతో కలసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ లో సీసీ రోడ్లు, ఆదిత్య నగర్, సుభాష్ చంద్రబోస్, ఇజ్జత్ నగర్, భిక్షపతి నగర్ లలోని శ్మశానవాటికలలో చేపటాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.