శేరిలింగంపల్లి, జూన్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): తిరుమల శ్రీవారిని శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రవీందర్ యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.సీఎం రేవంత్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో వున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ విఫలం అయ్యారు అని తెలిపారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని చెప్పారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా కేటీఆర్ చేసి చూపించారని తెలిపారు. కేటీఆర్ కృషితో ఐటీకి కేరాఫ్ గా హైదరాబాద్ మారిందన్నారు. దాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యింది అన్నారు. రేవంత్ సర్కార్ అభివృద్ధి చేయడం మరిచి.. పర్సెంటేజ్ లపై పడ్డారు అని ఆరోపించారు.
ప్రతి పనికి కమిషన్ పేరుతో వేధిస్తున్నారు అని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. ప్రతి రంగాన్ని కుదేలు చేశారు అని విమర్శలు గుపించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లో కాంగ్రెస్ సర్కార్ విఫలం అయ్యిందన్నారు. రైతులను, పింఛన్ దారులను, బీసీలతో పాటు సబ్భండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ పోయి బీఆర్ఎస్ సర్కార్ రావాలి అని బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ తిరుమల శ్రీవారిని మొక్కుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.