- కార్యకర్తలకు రూ. 10 లక్షల ప్రమాద భీమా
- తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: తన పుట్టిన రోజు సందర్భంగా ఉదార స్వభావాన్ని, సేవా తత్పరతను మరోసారి చాటారు శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ. అంతేకాక తన పుట్టిన రోజుని పురస్కరించుకుని శేరిలింగంపల్లిలో బీజేపీ పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న క్రియాశీల కార్యకర్తలకు, 58 బూత్ అధ్యక్షులకు తన సొంత ఖర్చుతో లింగంపల్లి లోని భారతీయ పోస్టల్ బ్యాంకులో రూ. 10 లక్షల ప్రమాద భీమా చేయించారు.
ఈ సందర్భంగా రాజు శెట్టి మాట్లాడుతూ కార్యకర్తలను పార్టీ ఎప్పుడు అక్కున చేర్చుకుంటుందని, పార్టీని నమ్మి వచ్చిన కార్యకర్తల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా తనపై ఉందని, రూ.399 తో ఉన్న ఈ భీమా పాలసీ ద్వారా 10 లక్షలు పొందడమే కాకుండా , చికిత్స సమయంలో.. ఐ.పి.డి ఖర్చుల కోసం రూ. 60 వేలు, ప్రమాదవశాత్తు గాయమైతే ఓ.పి.డి కోసం రూ. 30 వేలు ఇస్తారని చెప్పారు.
ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5 వేల సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారం అందిస్తుందని , ఈ భీమాకి ప్రతి సంవత్సరం కట్టాల్సిన మొత్తాన్ని తానే భరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భీమా చేయించుకున్న కార్యకర్తలు, మహిళలు రాజు శెట్టికి కృతజ్ఞతలు తెలిపారు.