నమస్తే శేరిలింగంపల్లి : పేద , మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సృజన, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద, మద్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులోకి ఉండేలా బస్తి దవాఖానలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర, ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో రోగులు ఉస్మానియా, నిలోఫర్ లాంటి వైద్యశాలలకు వెళ్లలేకపోయేవారని, ఈ ఆపత్కాల సమయంలో బస్తీ దవాఖానాలే ఆదుకున్నాయని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అదేవిధంగా బస్తీ దవాఖాన లో 55 రకాల వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి పీహెచ్ సీ వైద్య అధికారి శైలజ, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్ , రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, రాంచందర్, వేణు గోపాల్ రెడ్డి, కవిత, నటరాజు, రమణయ్య, పవన్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, గఫుర్, నర్సింహ రెడ్డి, మహేష్, అలీ, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.