వాట్సాప్ కాల్స్ రికార్డు కావనే భ్రమలో ఉండొద్దు..! గుట్టు అనుకుంటే.. రట్టవుతుంది జాగ్రత్తా..!

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో అత్యధికులు మెసేజ్ లతో పాటు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునేందుకు వాట్సాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. వినియోగదారుల ప్రైవసీకి అధిక ప్రాధాన్యతనిస్తూ వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో సేవలు అందిస్తోంది. అయితే ఇందులో ఆడియో, వీడియో రికార్డు చేసే అవకాశం లేకపోవడంతో ఈ మధ్యకాలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రేమికులు, వివాహేతర సంబంధాలు కలిగిన వారు, తదితరులు వాట్సాప్ వాయిస్ కాల్స్ ఎక్కువగా వాడుతున్నారు. రహస్యంగా సాగే సంభాషణలు రికార్డ్ కావద్దని, తమ గుట్టురట్టవ్వద్ధన్నది వారి వారి ఆలోచన.

అయితే వాట్సాప్ కాల్స్ ను కూడా రికార్డు చేయొచ్చని విషయం చాలామందికి నేటికీ తెలియదు. వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ రికార్డు చేసేందుకు ప్రస్తుతం ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ కాల్స్ రికార్డు చేయలేరు అని భావించే వారు కచ్చితంగా ఈ యాప్ ల గురించి అవగాహనా కలిగి ఉండటం అవసరం. గూగుల్ ప్లే స్టోర్ లో లభించే కాల్ రికార్డింగ్ యాప్ లలో చాల మటుకు సరిగ్గా పనిచేయకపోయినప్పటికీ కొన్ని యాప్ లు మాత్రం వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ ను క్లారిటీ తో రికార్డు చేస్తున్నాయి.

ముఖ్యంగా cube acr call recorder , record whatsap calls తదితర యాప్ లను వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ లను ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఇన్స్టాల్ చేసిన తరువాత యాప్ అడిగే కాంటాక్ట్ లిస్ట్, మైక్రోఫోన్, మీడియా స్టోరేజ్ తదితర పర్మిషన్లు ఇవ్వవలసి ఉంటుంది. యాప్ లో సూచించిన విధంగా సెట్టింగులు పూర్తి చేసిన తరువాత మన ఆండ్రాయిడ్ డివైస్ కు వచ్చే ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ అన్నింటినీ ఈ యాప్ లు రికార్డు చేస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here