మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయడం జరుగుతుందని డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామంలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను, కైదమ్మ కుంట వద్ద నూతనంగా నిర్మించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్‌ను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల సహకారంతో డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టిఆర్ఎస్ వార్డ్ సభ్యుడు కనకమామిడి వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు శేఖర్ గౌడ్, ప్రభు గౌడ్, ఏరియా కమిటీ సభ్యుడు సుదర్శన్, యూత్ సభ్యుడు నదీమ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.







