బిజెపి పాలనకు ముగ్దులై పార్టీలో చేరికలు

  • కెసిఆర్ పరిపాలనపై ప్రజలకు విశ్వాసం పోయింది
  • బిజెపి తీర్థం పుచ్చుకున్న శేరిలింగంపల్లి, మియాపూర్ డివిజన్ల యువకులు
  • పార్టీలో చేరిన యువకులకు కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్
పార్టీలో చేరిన యువకులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మసీద్ బండలోని బిజెపి పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి , మియాపూర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున యువకులు బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కన్వీనర్ రాఘవేందర్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బిజెపికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నదన్నారు. మియాపూర్ లోని స్టాలిన్ నగర్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీలో చేరిన దాదాపు 100 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి డివిజన్ కు సంబంధించి 200 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. నేడు తెలంగాణలో కెసిఆర్ పరిపాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని, అందుకే ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని, పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగులు గౌడ్, మాణిక్, ఎల్లేష్ అనిల్ కుమార్ యాదవ్, ఆదిత్య, వినోద్ యాదవ్, గణేష్, పద్మ, ముఖేష్ గౌడ్ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి, మియాపూర్ డివిజన్ల నుంచి పార్టీలో చేరిన యువకులతో రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, కన్వీనర్ రాఘవేందర్ రావు, బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here