శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ క్రిస్టల్ గార్డెన్ లో మిర్యాల ప్రీతం జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంపులో పాల్గొన్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, పేదలకు చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు కావల్సిన సహాయం అందజేస్తున్నామని అన్నారు. తన జన్మదినం సందర్భంగా మెడికల్ క్యాంపును నిర్వహించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి పాల్గొని ప్రీతంకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, కూకట్పల్లి జనసేన కంటెస్టెడ్ అభ్యర్థి ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, ఎంబీసీ చైర్మన్ జైపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ రఘునందన్ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్ రావు, చందానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుంకర విజయ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి, ఉరిటి వెంకట్రావు, ప్రవీణ్, అభిషేక్ గౌడ్, అక్బర్, అక్తర్, అంజద్ ఖాన్, మహబూబ్, అలీ, గఫర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.






