తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆషాడ బోనాల పండుగను పురస్కరించుకుని బీహెచ్ఈఎల్ శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి, చందానగర్, నల్లగండ్ల, గుల్మోహర్ పార్క్, రాజీవ్ గృహకల్ప, సందయ్య నగర్, శాంతినగర్, శివాజీ నగర్, డివిజన్ లోని వివిధ అమ్మవారి దేవాలయాల్లో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాల్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంఐజి ఫేస్ 1 లోని ఎల్లమ్మ తల్లికి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జభవాని అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు వివిధ సంప్రదాయాలను గౌరవించాల్సి ఉందన్నారు. బోనాల వేడుకలకు ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. కార్పొరేటర్ తో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గడ్డం రవి యాదవ్, ఆయా టెంపుల్ కమిటీ మెంబర్స్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here