శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రజలందరికి ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ విలేజ్, ముజాఫర్ హైహ్మద్ నగర్, నడిగడ్డ తాండ, టి ఎన్ నగర్ కాలనీలలో ఉన్న అమ్మవార్ల దేవాలయలలో స్థానిక నాయకులు కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాలనీల వాసులు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.