సోనియా గాంధీనే తెలంగాణ తల్లి

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ పిసిసి డెలిగేట్ సత్యనారాయణరావు
హాఫిజ్ పెట్ డివిజన్ లో నిర్వహించిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో మాట్లాడుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ పిసిసి డెలిగేట్ సత్యనారాయణరావు

నమస్తే శేరిలింగంపల్లి: తన దృష్టిలో సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని శేరిలింగంపల్లి నియోజకవర్గ పిసిసి డెలిగేట్ సత్యనారాయణరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని తెలిపారు. ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్పనాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. సోనియా గాంధీ 76వ జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లి హాఫిజ్ పెట్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సమీర్ కౌషల్, పిసిసి కార్యదర్శి రఘునందన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇండియాస్ షరీఫ్, ఎ బ్లాక్ అధ్యక్షుడు, భరత్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కె. శశికాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జమీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జలంధర్ రావు, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ పాల్గొన్నారు.

సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో భాగంగా పార్టీ బృందంతో కలిసి భారీ కేకును కట్ చేస్తున్న సత్యనారాయణరావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here