శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఉన్న అమ్మవారి దేవాలయాల్లో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాల్లో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర, రాయదుర్గం, ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి , గోపనపల్లి తండాలలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ ,మైసమ్మ, పెద్దమ్మ తల్లుల దీవెనలతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు .అమ్మవారికి నైవేద్యం సమర్పించి చీడ పీడల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అంటూ భక్తులు గ్రామ దేవతను మొక్కుకుంటూ ఘనంగా నిర్వహించే వేడుక బోనాలు అని అన్నారు.అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఆషాడ మాసంలో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక. అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు , భక్తులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






