శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆషాడ బోనాల పండుగ జాతర మహోత్సవంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .