శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): బోనాల పర్వదినం సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ లో ఉన్న శ్రీ మహా శక్తి లలిత పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలా బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గంలోని ప్రతి ఆలయానికి బోనాల నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






