శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన (Storm Water Drain) వరదనీటి కాలువ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణం పనులను కాలనీవాసులతో కలసి పరిశీలించడం జరిగిందని, వరదనీటి కాలువ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలో నే వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, పనులలో వేగం పెంచాలని, పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీవాసులు రామకృష్ణ వర్మ, శ్రీనివాస్, సుధాకరరెడ్డి, నవీన్, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.