హైదరాబాద్‌లో ఇండియాలోనే మొదటి పే-యాజ్-యూ-గో ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఫిట్‌నెస్ ప్రియులు, జిమ్ వెళ్ళేవాళ్లు, పర్సనల్ ట్రైనర్ల‌ కోసం పారదర్శకతతో కూడిన, ఎటువంటి బంధనాలు లేని కొత్త మోడల్ ను ఆవిష్క‌రించారు. స్టీల్ అవర్లీ జిమ్ పేరిట భారత్‌లో తొలిసారిగా పే-యాజ్-యూ-గో మోడల్‌ను తీసుకొచ్చారు. ఈ ఫిట్‌నెస్ కేంద్రం ఫిట్‌నెస్ ప్రియులు, జిమ్ వాడేవాళ్లు, స్వతంత్ర వ్యక్తిగత ట్రైనర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. గచ్చిబౌలిలో ఉన్న ఈ 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జిమ్ అత్యాధునిక సౌకర్యాలను, అనుకూలతను, పారదర్శకతను అందిస్తోంది. ఈ సంద‌ర్భంగా స్టీల్ అవర్లీ జిమ్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత ఫిట్‌నెస్ కోచ్ కునాల్ గిర్ మాట్లాడుతూ ఓన్ ది ప్లాట్‌ఫామ్ – ఓన్ యువర్ ఫ్యూచర్ అనే శీర్షికతో జరిగిన సెమినార్‌లో స్టీల్ జిమ్ తన వినూత్న మోడల్‌ను పరిచయం చేసింద‌న్నారు.

ఇందులో లాంగ్‌టర్మ్ మెంబర్‌షిప్‌లు, రెవెన్యూ షేరింగ్ సమస్యలు, బైండింగ్ కాంట్రాక్ట్స్ లేవ‌ని, ట్రైనర్లు, క్లయింట్లు ఇద్దరికీ సంపూర్ణ స్వేచ్ఛను అందిస్తుంద‌ని తెలిపారు. ట్రైనర్లకు 100% ఆదాయం ఉంటుంద‌ని, కమీషన్‌లు లేదా రెవెన్యూ షేరింగ్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌ర్లీ యాక్సెస్ మోడల్ వ‌ల్ల వినియోగ‌దారులు వాడిన గంటలకే చెల్లించే వెసులు బాటు ఉంద‌న్నారు. లేటెస్ట్ కార్డియో & స్ట్రెంగ్త్ ఎక్విప్‌మెంట్, టర్ఫ్, సౌనా, వాలెట్, లాకర్లు వంటి స‌దుపాయాలు ఉన్నాయ‌న్నారు. ట్రైనర్లు, క్లయింట్లు విడివిడిగా స్కాన్ చేసుకుని వాళ్లు వాడిన సమయానికి మాత్రమే చెల్లిస్తార‌ని తెలిపారు. ఫ్లెక్సిబుల్ ధరలు, హ్యాపీ అవర్స్ స్టీల్ యాప్ ద్వారా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

ఈ ప్లాట్‌ఫామ్ నేటి ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకునే తరం కోసం రూపొందించబడింద‌ని, ఫిట్‌నెస్ ప్రియులు అయినా, క్లయింట్లను నిర్మించుకుంటున్న పర్సనల్ ట్రైనర్ అయినా, ఇప్పుడు మొదలు పెడుతున్నవారైనా స్టీల్ సంపూర్ణ స్వేచ్ఛ, ప్రీమియం యాక్సెస్, పారదర్శకతను అందిస్తుంద‌న్నారు. పే-పర్-యూజ్ మోడల్ ద్వారా స్టీల్ అవర్లీ జిమ్ యూజర్లు తాము కోరిన సమయానికి, తాము కావలసినంత సౌకర్యాలు వాడుకునే అవకాశం కల్పిస్తుంద‌ని తెలిపారు. ట్రైనర్లు తమ సేవలను రెవెన్యూ షేరింగ్ లేకుండా, పోటీ లేకుండా విస్తరించుకునే వీలుంటుంది. ఉదాహరణకు, ఒక ట్రైనర్ ₹50,000 నెలగా ఛార్జ్ చేస్తే, కేవలం ₹7,999తో 20 గంటలు బుక్ చేసుకొని 84% ఆదాయాన్ని retain చేసుకోవచ్చ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here