అత్యంత ప్రతిష్టాత్మకం మెట్రో రెండో దశ

  • రూ.6,250 కోట్లతో.. 31 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్
  • శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
  • హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
  • ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి తెలంగాణ అభివృద్ధి ప్రధాత, సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద పునాదిరాయి వేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో భాగంగా రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నదని, ఇందులో భాగంగా మొత్తం 31 కిలోమీటర్ల పొడవునా మెట్రో కారిడార్ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు.

మెట్రో రెండో దశకు మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు

శేరిలింగంపల్లి ప్రాంతంలో మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు తన తరఫున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. ఐటీ ఉద్యోగులకు, విమానాశ్రయం వెళ్లే వారికి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

మెట్రో రెండో దశ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , నవీన్ కుమార్, ప్రభాకర్ , శంబిపూర్ రాజు, దయానంద గుప్తా, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మంచి రెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, KP వివేకానంద, మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, నేతి సుభాష్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, అలా వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, నగేష్, రంగారెడ్డి జిల్లా జడ్పి చైర్మన్ అనిత, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కార్పొరేటర్ హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, రోజాదేవి రంగ రావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, జోనల్ కమిషనర్ శంకరయ్య, మెట్రో ఎండీ NVS రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, ట్రాఫిక్ ఏసీపీ హన్మంత రావు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు రూ.6,250 కోట్లను చెక్కు రూపేణా అందజేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here