శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్ పల్లి (పార్ట్), వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ PPE కిట్లను పారిశుధ్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మరిచిపోలేమని అన్నారు. మన పరిసర ప్రాంతాలను, కాలనీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ, కాలనీలలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రహదారులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పనిచేస్తున్నారని, పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అందులో భాగంగానే వారికి పీపీఈ కిట్లను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య సూపర్ వైజర్ మనోహర్ రెడ్డి, నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు , దొడ్ల రామకృష్ణ గౌడ్ , మోజేశ్, చంద్ర మోహన్ సాగర్, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.