భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, అత్యవసరం తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు. భారీ వర్షం కారణంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పరిధిలోని పలు డివిజన్లలో ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి ఆయ‌న‌ పర్యటించి, పరిశీలించారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలు అందరు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమ‌త్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని అన్నారు. ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న‌ భారీ వర్షాల కారణంగా, ప్రజలు, ప్రతి కాలనీ వాసులు తమ ఇండ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here