మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను కలిసిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఉప్పరి రమేష్ సాగర్

  • (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యుడి గా ఉప్పరి రమేష్ సాగర్ ఎన్నిక
  • మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు

 

 

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను కలిసిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఉప్పరి రమేష్ సాగర్

నమస్తే శేరిలింగంపల్లి: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యుడి గా ఉప్పరి రమేష్ సాగర్ ఎన్నికైన సందర్బంగా గురువారం మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీలను ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉప్పరి రమేష్ సాగర్, టియుడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఫైళ్ల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి టెంజు మాజీ అధ్యక్షుడు రవిందర్ రెడ్డిలతో వారిని కలిసి పూల బొకే అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అల్లం నారాయణతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ సి గోరెటి వెంకన్న, ఆస్కాని మారుతి సాగర్, వినోద్ కోహ్లీలు ఉప్పరి రమేష్ సాగర్ ను అభినందించారు.

 

టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీలను పూల బొకే అందిస్తున్న దృశ్యం

అనంతరం ఉప్పరి రమేష్ సాగర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు యూనియన్ కోసం , జర్నలిస్ట్ సోదరుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణకు, టియుడబ్ల్యూజె సలహాదారుడు, శాసన సభ్యుడు చంటి క్రాంతి కిరణ్, టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఐజేయూ జాతీయ అధ్యక్షులు వినోద్ కోహ్లి, ఐజేయూ ప్రధాన కార్యదర్శి సభానాయక్ ఐజేయు జాతీయ కమిటీ సభ్యులకు, టియుడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా కమిటీకి ముఖ్యంగా శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ సోదరులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అల్లంనారాయణ దృష్టికి శేరిలింగంపల్లి జర్నలిస్ట్ ల సమస్యలను తీసుకెళ్లగా సంక్రాతి తర్వాత వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here