హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ గాంధీ

  • పటేల్ చెరువు వద్ద 7.0 ఎం.ఎల్.డి సామర్థ్యం తో..
    రూ. 26.27 కోట్ల అంచనావ్యయంతో.. చేపడుతున్న ఎస్. టి. పి నిర్మాణ పనుల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద 7.0 ఎం.ఎల్.డి సామర్థ్యం తో రూ. 26.27 కోట్ల అంచనావ్యయంతో ఎస్. టి. పి నిర్మాణ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.

పటేల్ చెరువు వద్ద చేపడుతున్న ఎస్. టి. పి నిర్మాణ పనుల పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

హైద‌రాబాద్ నగరం ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, ప్రజా అవసరాలకునుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. తాగు నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని, ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 772 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల‌కు అద‌నంగా 1260 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమ‌తి ఇచ్చిందని, దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని, 31 ప్రాంతాల్లో ఈ సీవ‌రేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నందుకు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల త‌ర‌పున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు హృద‌య‌పూర్వ‌క‌మైన ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఎస్. టి. పి నిర్మాణ పనుల గురించి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంజూరయిన 7 (STP) మురుగు నీటి శుద్ధి కేంద్రాల వివరాలు: 
  • మియాపూర్ పటేల్ చెరువు 7.0 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 26.27 కోట్ల అంచనావ్యయం నిర్మాణం
  • గంగారాం పెద్ద చెరువు – 20 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 64.14 కోట్ల అంచనావ వ్యయంతో నిర్మాణం
    దుర్గం చెరువు 7.0 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 25.67 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణం
  • కాజాగుడా చెరువు 21 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 61.25 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణం
  • అంబిర్ చెరువు 37 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 100.87 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణం
  • ఎల్లమ్మ కుంట చెరువు జయనగర్ లో 13.50 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 43.46 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణం
  • పరికి చెరువు – 28 ఎం.ఎల్.డి కెపాసిటీతో రూ. 83.05 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జలమండలి జలమండలి ఎస్ టి పి విభాగం అధికారులు, డిజిఎం శ్రీనివాస రాజు, మేనేజర్ శంకర్, మెగా ప్రాజెక్ట్స్ ఇంజనీర్ వెంకట్ రామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం డి. ఇబ్రహీం, మహ్మద్ కాజా పాల్గొన్నారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here