అంగరంగ వైభవంగా భోగి సంబరాలు

  • ఆరంభ టౌన్షిప్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పండుగ
  • పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న అసోసియేషన్ వాసులు, ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి: ఆరంభ టౌన్షిప్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు నిర్వహించారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా కాలనీవాసులందరూ భోగి సంబరాలు లో పాల్గొని పరస్పరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక భోగి అని ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్ అన్నారు.

ఆరంభ టౌన్షిప్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటలు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు

భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ఆరంభ టౌన్షిప్ కాలనీవాసులందరికీ అసోసియేషన్ తరపున భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ, శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రామ భూపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్ , శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, మహేష్, కుటుంబరావు, మన్నే రవీందర్, మహేందర్, మౌలిక, శ్వేత, రజిని, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here