నమస్తే శేరిలింగంపల్లి: భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో అనంత టెక్నాలజీ నుండి జూబ్లీ ఎనక్లేవ్ వరకు రూ.2 కోట్ల 35 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (యుజిడి ) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ , జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు కార్పొరేటర్లు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ (1Km) మేర చొప్పున భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు రవీందర్ ముదిరాజు, మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉట్ల కృష్ణ , జంగం గౌడ్ , నర్సింహ సాగర్,తిరుపతి రెడ్డి, తిరుపతి, గణపతి, రజినీకాంత్, తిరుపతి, బసవయ్య, యాదగిరి గౌడ్, నందు సింగ్, నరేష్, రమేష్, వినయ్ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.