శేరిలింగంపల్లి, మే 13 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న మియాపూర్ ప్రాంతంలో పేదలు అనేక అవస్థలు పడుతున్నారని, వారు మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పాలకులు వెంటనే స్పందించి మౌలిక వసతులును కల్పించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. మియాపూర్ శాఖ ఐదవ మహాసభ అల్విన్ కాలనీలో నిర్వహించారు. ఐదో మహాసభ సందర్భంగా ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సెక్రటరీ రామకృష్ణ, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా బాధ్యుడు కే చందు యాదవ్ పాల్గొని నూతన శాఖను ఏర్పాటు చేశారు. మియాపూర్ శాఖ కార్యదర్శిగా కొమ్ము పరమేష్, సహాయ కార్యదర్శిగా మల్లయ్యను ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారని శేరిలింగంపల్లి మండల కార్యదర్శి టి రామకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షుడు తుపాక రాములు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.