శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడలో ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి వార్ల దేవస్థాన సముదాయంలో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చతుర్ద(4వ) వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్ల కృష్ణ, నర్సింహ యాదవ్, ఉట్ల దశరథ్, రాధ కృష్ణ యాదవ్, మాధవి, రమేష్, మణిరత్నం, ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.