శేరిలింగంపల్లి, మే 13 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పరిసర ప్రాంతాలలో ఉంటున్న సీనియర్ సిటిజన్స్ , మహిళల అభ్యర్థన మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్, TAC సభ్యుడు బుచ్చిరెడ్డి పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను తీర్చాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ చందానగర్ లో ఉంటున్న పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎన్నో సంవత్సరాలుగా సరైన వసతులు లేక స్థానిక ప్రజలు , సీనియర్ సిటిజన్స్ అనేక విధాలుగా ఇబ్బందులు పడడమే కాకుండా పార్కింగ్ సమస్య ఉందన్నారు. సిబ్బందికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ విషయంపై స్థానిక పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆయన ద్వారా సంబంధిత అధికారులకు కార్యాలయ మార్పుకు సంబంధించిన విషయం పై చర్చించి పై అధికారులకు లెటర్ ద్వారా ఆదేశాలు జారీ చేయించామని తెలిపారు. ఈ కార్యాలయాన్ని వెంటనే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రాంతానికి లేదా ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ పై అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు. అవసరమైతే ఎంపీ, ఉన్నతాధికారులతో మాట్లాడి తమ పూర్తి సహాయ సహకారాలు అందించి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఉండాలని పోస్ట్ మాస్టర్ వెంకటేష్ గౌడ్ ని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్ , వెంకటేష్, కృష్ణమూర్తి, శేఖర్ ముదిరాజ్ , శంకర్ రెడ్డి, పృద్వి గౌడ్, కృష్ణ కాంత్, మూర్తి , క్రాంతి తదితరులు పాల్గొన్నారు.