నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వ పెద్దలు.. సామాన్యులు, బీద, బడుగు బలహీన వర్గాల జీవన విధానాల్లో మెరుగు కోసం ఎటువంటి కృషి చేయలేదని జనసేన శేరిలింగం పల్లి, నియోజవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి అన్నారు. మంగళవారం చందానగర్ అండర్ పాస్ బ్రిడ్జీ సందర్శించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో అధిక ఆదాయం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచే వస్తున్నదని, అయినా శేరిలింగం పల్లి అభివృద్ధికి నిధులు కేటాయించటం లేదన్నారు. చందానగర్ అండర్ పాస్ ల ద్వారా రోజుకు వేలాది మంది ప్రయాణిస్తున్నారని, వర్షాలు వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
ఈ విషయమై వినతి పత్రాల ద్వారా ఇప్పటికే 4, 5 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. ఎన్నికల సమయాల్లో కాకుండా ఇటువంటి సమయాల్లో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే నియోజకవర్గం అంతా తిరిగితే ప్రజలు సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. వెంటనే చందానగర్ అండర్ పాస్ ల డ్రైనేజ్ వ్యవస్థను రిపేర్ చేయించి, శాశ్వత పరిష్కారం కోసం ఆలోచనలు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్లేష్ ముదిరాజ్, హనుమంత్ నాయక్ , గాంధీ , Sd సాజిద్, రఘు పాల్గొన్నారు.