సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు చారిత్రాత్మకం

  • 43వేల 373 మంది కుటుంబాలకు వెలుగు
  • ఆర్టీసీ ఉద్యోగులకు భారీ కానుక
  • ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం
  • అసాధ్యాలు, సుసాధ్యాలు చేసే సత్తా సీఎం కే సాధ్యం
  • చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్ గాంధీ
  • ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
  • బాణా సంచా కాల్చి, సీట్లు పంచి సంబురాలు

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ నిర్ణయం 43 వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ఈ శుభసందర్భంగా మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బస్ డిపో- 1, బస్ డిపో – 2లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , ఆర్టీసీ ఉద్యోగుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చి, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, అసాధ్యాలు, సుసాధ్యాలు చేసే ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, ఎవరు కలలో కూడా ఊహించని విధంగా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారని, సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారన్నారని, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వీరికి స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదని, ఏపీ రాష్ట్రంలో అక్కడ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారనే భావన వారిలో ఉండేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని, మేమంతా ఎప్పటికీ ఆయన చేసిన మేలును మరిచిపోమని, రుణపడి ఉంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇక ఉద్యోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని అన్నారు.

ఈ నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర, దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారని అన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ బిల్లు పాస్‌ చేసి ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చుతామని, వారి ఉద్యమ స్పూర్తికి కానుకగా దీన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here