శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్మెంట్స్ 5th ఫేజ్ D బ్లాక్ లో బిజయ్ నాయక్ కుమార్తె హన్సిక అనే విద్యార్థిని St మార్టిన్ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. హన్సిక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. జరిగిన సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన స్థానిక యువనాయకుడు దాత్రీనాథ్ గౌడ్ మృతి చెందిన యువతి తండ్రి, బంధువులతో వెళ్లి స్కూల్ యాజమాన్యంతో చర్చించి రూ.7 లక్షల నష్ట పరిహారం ఇప్పించారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం హామీ ఇచ్చింది. స్కూల్ యాజమాన్యం తో చర్చించే విషయంలో సహకరించిన బీజేపీ నాయకుడు మహేష్ యాదవ్, MCPI నాయకుడు పల్లె మురళి,BRSV నాయకులు, NSUI నాయకులు, జనప్రియ D బ్లాక్ ప్రతినిధులకు దాత్రీనాథ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.






