గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లిలోని న‌ల్ల‌గండ్ల ఎక్స్ రోడ్డు వ‌ద్ద ఓ వ్య‌క్తి అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్నాడ‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు అత‌న్ని చికిత్స నిమిత్తం జూలై 21వ తేదీన గాంధీ హాస్పిటల్‌కు త‌ర‌లించారు. అత‌ను చికిత్స పొందుతూ జూలై 25వ తేదీన మృతి చెందాడు. ఈ మేర‌కు పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుని వ‌య‌స్సు సుమారుగా 25 నుంచి 30 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని, ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే 9490617118, 8712663184 ఫోన్ నంబ‌ర్ల‌లో త‌మ‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here