అక్షయపాత్ర వద్దు.. కార్మికులకే ఇవ్వండి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శేరిలింగంపల్లి మండల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నభోజన పథకం కింద శేరిలింగంపల్లి మండల పరిధిలో 325 కార్మికులు విద్యార్థులకు వంట వండి వడ్డిస్తున్నారని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా ఈ పథకాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారని, కానీ ఈ విద్యా సంవత్సరం మొదలుకొని ఈ పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం కోసం గట్టి ప్రయత్నాలు జరిగాయని, ఈ ప్రయత్నాలు తిప్పి కొట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసు, విద్యాశాఖ డైరెక్టర్, డిఇఓ, ఎంఈఓ వద్ద ధర్నాలు మెమొరండాలు సమర్పించామని, శేరిలింగంపల్లి మండలంలో ఎమ్మెల్యే గాంధీకి కూడా వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్షయపాత్ర భోజనాన్ని పాఠశాలలో పంపిణీ చేస్తున్న క్రమంలో శేరిలింగంపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్ద అక్షయపాత్ర భోజనాన్నిఆపి కార్మికులందరూ కలిసి వెనక్కి పంపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వ, అధికారుల స్పందించి అక్షయపాత్రకు ఇవ్వకుండా కార్మికుల తోటే వంట వండి విద్యార్థులకు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు శ్రీశైలం షణ్ముగం కిరణ్ వరలక్ష్మి ,గోపి, యశోద, పద్మ, గౌరమ్మ, శోబా, గాయిత్రి, రాణి బాయి,రాములు, షేక్ అలి, మౌలానా బి, నసిమ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here