శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమక్షంలో ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించిన భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పలువురు కార్పొరేటర్లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతి ఆవశ్యకత ఉందన్నారు. బలమైన శక్తివంతమైన ఓబీసీ ఉద్యమంపై సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు. బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓబీసీల అభివృద్ధి కోసం మాట్లాడే ప్రతి గళం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు, బీసీ సంఘాల ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.






