- హెచ్ ఎస్ సి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రదానం
నమస్తే శేరిలింగంపల్లి : సామాజిక , సాహిత్య సేవలకు గుర్తింపుగా..
తెలుగు, వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావుకు డాక్టరేట్ వరించింది. కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న అక్షర సేద్యానికి గుర్తింపు తెచ్చి పెట్టింది.
శనివారం సికింద్రాబాద్ లోని అమ్ శ్రీ టవర్స్ లో హెచ్ ఎస్ సి యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావుకు బిషప్ డాక్టర్ ఆనంద్ కుమార్ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మోటూరి నారాయణరావు మాట్లాడారు. తెలుగు వెలుగు సాహిత్య వేదికకు , గత రెండున్నర దశాబ్దాలుగా తనలోని జర్నలిస్టుకు 15ఏళ్లుగా నిర్వహిస్తున్న సామాజిక సేవలకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. తన ఎదుగుదలకు తోడ్పడిన తల్లి శేరిలింగంపల్లికి, తనను హత్తుకున్న పటాన్ చెరుకు తనతోటి జర్నలిస్టు మిత్రులకు, సాహితీ సన్మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధు వర్గానికి, కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇటివలే పటాన్ చెరులో జాతీయ స్థాయిలో 8రాష్ట్రాల నుంచి దాదాపు 800మంది కవులను ఒక వేదికపైకి చేర్చి జాతీయ సాహిత్య సంబరాలను నిర్వహించిన కృషి ఫలించింది. శేరిలింగంపల్లి కేంద్రంగా 2010వ సంవత్సరం నుంచి ఎస్ వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో సామాజిక సేవలు పలువురికి ఆదర్శనంగా నిలుస్తున్నాయి.